అల వైకుంఠపురములో హైలైట్ సీన్లు ఇవేనట!

12 0

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా పూజా హెగ్డే కథానాయికగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం అల వైకుంఠపురములో. భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్, హాసినీ క్రియేషన్స్ బ్యానర్లో అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు మరియు తమన్ సంగీతం సమకూరుస్తున్నారు.

అల వైకుంఠపురములో హైలైట్ సీన్లు ఇవేనట!

జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాల తరువాత అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో వస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, పాటలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. అయితే ఇవి మాత్రమే కాదు ఈ సినిమాలో చాలా మంది సీనియర్ నటీనట్లు నటిస్తున్నారు.

అందులో తమిళ నటుడు సముద్రఖని ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం కోసం అల్లు అర్జున్ బాగా కష్టపడుతున్నాట. ఇక ఈ చిత్ర టీజర్ లో సముద్రకని అల్లు అర్జున్ ఎదురుపడే సీన్ చాలా బాగుంది. ఇక సినిమాలో అల్లు అర్జున్ , సముద్రఖని మధ్య ఇలాంటివి చాలానే ఉన్నాయట. ఎంతో సీరియస్ యాక్షన్ సీన్లు తో పాటూ అల్లు అర్జున్ ఫుల్ కామెడీ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటారట. అలానే సాంగ్స్, డాన్స్ లతో.. ఎమోషన్స్ ఇలా చాలానే సినిమాలో హైలెట్గా ఉంటాయని టాక్ వినిపిస్తోంది.

సంక్రాంతి కానుకగా విడుదల అవుతున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే టిజర్, సాంగ్స్ రికార్డులు బద్దలు కొట్టాయి. తమన్ బాణీలు క్లాస్ మాస్ ఆడియన్స్ని ఆకట్టుకునే విధంగా ఉండటంతో అల వైకుంఠపురంలో సినిమా పై భారీ హైప్ క్రియేట్ అయింది.

Click Here For More Details Of Android apps.

Related Articles

Add Comment