ధోనీ ఆడటం పై క్లారిటీ ఇచ్చిన అనిల్ కుంబ్లే..!

21 0

భారత జట్టు మాజి కెఫ్టెన్, వికెట్ కీపర్ ఎంఎస్ ధోనీ పునరాగమనం ఐపీఎల్ పై ఆధారపడి ఉంది. టీ20 ప్రపంచకప్‌కు ధోనీ సేవలు అవసరమని జట్టు భావిస్తే.. అతడు జట్టులో తప్పకుండా ఉంటాడని భారత మాజీ కెఫ్టెన్, దిగ్గజం అనిల్ కుంబ్లే అన్నారు. ప్రపంచకప్ ఉన్న క్రమంలో ఆల్‌రౌండర్ల కంటే వికెట్లు తీసే సత్తా ఉన్న బౌలర్లపై భారత్ దృష్టి పెట్టాలని అన్నారు.

ధోనీ ఆడటంపై క్లారిటీ ఇచ్చిన అనిల్ కుంబ్లే..!

తాజాగా అనిల్‌ కుంబ్లే మాట్లాడుతూ..” ఐపీఎల్‌లో ధోనీ ఆడే విధానం చూడాలి. ధోనీ పునరాగమనం అనేది ఐపీఎల్ పై ఆధారపడి ఉంది. టీ20 ప్రపంచకప్‌కు సమయం దగ్గర పడుతోంది కాబట్టి మహీసేవలు అవసరమని జట్టు భావిస్తే టీమిండియాలో తప్పకుండ ఆడుతాడు.

అయితే దీని కోసం మనం వేచి చూడాలి” అని పేర్కొన్నారు. ప్రపంచకప్ 2019 తర్వాత ధోనీ విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలిసిందే. న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ-ఫైనల్‌లో ధోనీ చివరిసారిగా ఆడాడు.

Click Here for the Details of How to Guides

Related Articles

Add Comment