సరిలేరు ఈవెంట్లో బిగ్గెస్ట్ సర్ప్రైజ్

17 0

ఇంతకుముందు మహేష్ బాబు సినిమాలకు సంబంధించి ఏ వేడుక జరిగినా ఆయన తండ్రి కృష్ణ ముఖ్య అతిథిగా వచ్చేవారు. ఐతే ఈ మధ్య ఆయనకు ఓపిక తగ్గినట్లుంది. అంతే కాక తాను అందరి వాడినని చాటడానికి, తన సినిమాల్ని మరింతగా జనాల్లోకి తీసుకెళ్లడానికి వేరే హీరోల్ని తన వేడుకలకు ఆహ్వానిస్తున్నాడు.

సరిలేరు ఈవెంట్లో బిగ్గెస్ట్ సర్ప్రైజ్

రెండేళ్ల కిందట ‘భరత్ అనే నేను’ చిత్ర ప్రి రిలీజ్ ఈవెంట్‌కు జూనియర్ ఎన్టీఆర్‌ను, ‘మహర్షి’ వేడుకకు విజయ్ దేవరకొండను మహేష్ ముఖ్య అతిథులుగా రప్పించి ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తన కొత్త చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రి రిలీజ్ ఈవెంట్‌కు ఏకంగా మెగాస్టార్ చిరంజీవినే రప్పిస్తున్నాడు మహేష్. చిరు, మహేష్‌లను ఒకే వేదికపై చూడటం సగటు సినీ ప్రేక్షకులకు మహదానందం కలిగించే విషయమే. అందుకే దీనికి ‘మెగా సూపర్ ఈవెంట్’ అని పేరు పెట్టారు.

ఈ ఈవెంట్‌కు సంబంధించి ఒక పెద్ద సర్ప్రైజ్‌ను నిర్మాత అనిల్ సుంకర బయటపెట్టారు. ఈ వేడుకలో మహేష్ స్వయంగా హోస్ట్ పాత్రలో కనిపించనున్నాడట. ఆయనే చిరు సహా అతిథుల్ని వేదిక మీదికి పిలవడంతో పాటు స్టేజ్ మీది నుంచి అభిమానులతో ఇంటరాక్ట్ అవుతాడట. ఇలా తన సినిమా ఈవెంట్లో హీరో హోస్ట్‌గా వ్యవహరించడం తొలిసారి అని అనిల్ అంటున్నారు. మరో హీరో ఇలా చేస్తే ఆశ్చర్యం లేదు కానీ.. మామూలుగా వేదికలెక్కి మాట్లాడటానికే చాలా మొహమాట పడిపోయే మహేష్.. ఏకంగా హోస్ట్ పాత్రలో కనిపించడం అంటే విశేషమే.

Also, Read:

Related Articles

Add Comment